ఆన్‌లైన్‌లోనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు

3 Oct, 2018 02:30 IST|Sakshi

న్యూఢిల్లీ: ఏడు రకాలైన నేరాలపై ఎఫ్‌ఐఆర్‌(ప్రాథమిక సమాచార నివేదిక)లను ఆన్‌లైన్‌లోనే నమోదు చేసుకోవడంతోపాటు, సంబంధిత సేవలు పొందే అవకాశం త్వరలో అందుబాటులోకి రానుంది. కేంద్ర హోంశాఖ స్మార్ట్‌ పేరుతో రూపొందించిన ఈ విధానం దేశంలోని 34 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో త్వరలోనే దీనిని అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇందులో వివిధ నేరాలకుపై ఆన్‌లైన్‌లోనే పోలీసులకు ఫిర్యాదుల చేయవచ్చు. దీంతోపాటు నర్సులు, ఇళ్లలో కిరాయిదారులు, డ్రైవర్లకు సంబంధించిన సమాచారం వెరిఫికేషన్‌కు, సభలు, సమావేశాలు పెట్టుకునేందుకు అనుమతులు, వాహనం చోరీకి గురైనా, పోగొట్టుకున్న లేదా దొరికిన వస్తువులకు సంబంధించి ఆన్‌లైన్‌ ద్వారా సమాచారం పొందవచ్చు. ఈ వెబ్‌పోర్టల్‌లో అందిన ఫిర్యాదులు, వినతులను నేరుగా సంబంధిత రాష్ట్రాలకు పంపి, తక్షణం చర్యలు తీసుకునేలా సూచనలిస్తారు. కోరిన సమాచారాన్ని ఫిర్యాదుదారుకు మెయిల్‌లో పంపుతారు.  

>
మరిన్ని వార్తలు