‘ఆన్‌లైన్‌ లెర్నింగ్‌’కు ప్రాధాన్యం

29 May, 2020 03:05 IST|Sakshi

ఏఐసీటీఈ చైర్మన్‌ ప్రొఫెసర్‌ అనిల్‌ సహస్రబుద్దే  

సాక్షి, హైదరాబాద్‌: భవిష్యత్తులో ఆన్‌లైన్‌ బోధనే ప్రధానం కానుందని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) చైర్మన్‌ ప్రొఫెసర్‌ అనిల్‌ సహస్రబుద్దే పేర్కొన్నారు. కరోనా తర్వాత∙సాంకేతిక విద్య– సవాళ్లపై రాష్ట్ర ఉన్నత విద్యా మండలి గురువారం వెబినార్‌ను నిర్వహించింది. ఇందులో ఇండస్ట్రీ ప్రము ఖులు, కాలేజీల యాజమాన్యాలు, ఏఐసీటీఈ చైర్మన్‌ సహస్రబుద్దే పాల్గొన్నారు. ప్రస్తుత కరోనా నేపథ్యంలో ఆఫ్‌లైన్‌ బోధన కొనసాగింపు, ప్రత్యా మ్నాయ బోధనా మార్గాలపై పరిశీలన జరుపు తున్నామని, తరగతి గది బోధన నుంచి డిజిటల్‌ అభ్యసనవైపు పయనించాల్సిన అవసరం వస్తుందని వెల్లడించారు. విద్యార్థులపై భారం పడకుండా చూస్తూ నిరంతర మూల్యాంకనం కొనసాగిం చాలన్నారు. ఉపాధ్యాయ శిక్షణకు ఏఐసీటీఈ నిర్వహిస్తున్న కార్యక్రమాలను ఆయన వివరించారు.

>
మరిన్ని వార్తలు