3,500 పోటీ చేస్తే 9 మంది గెలిచారు

22 May, 2016 20:12 IST|Sakshi
3,500 పోటీ చేస్తే 9 మంది గెలిచారు
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో స్వంతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి దిగిన వారికి నిరాశే మిగిలింది. మొత్తం 3,500 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా అందులో విజయం సాధించింది కేవలం 9 మందే. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. గెలిచిన 9 మందిలో ఒక్క కేరళ నుంచే ఆరుగురు విజయం సాధించారు. అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిల నుంచి ఒక్కొక్కరు చొప్పున మొత్తం ముగ్గురు గెలుపొందారు. తమినాడు నుంచి ఒక్కరూ గెలవకపోవడం గమనార్హం.
 
3,500 మందిలో కేరళ నుంచి 782, అస్సాం నుంచి 711, పశ్చిమ బెంగాల్ నుంచి 371, పుదుచ్చేరి నుంచి 96 మంది రంగంలోకి దిగినట్టు ఎన్నికల కమిషన్ వెల్లడించింది.  మొత్తం 822 నియోజక వర్గాల్లో పోలింగ్ జరిగింది. ఇండిపెండెంట్ అభ్యర్ధులు పశ్చిమ బెంగాల్లో 2.2 శాతం, తమిళనాడులో 1.4 శాతం, కేరళలో 5.3 శాతం, అస్సాంలో 11 శాతం, పుదుచ్చేరిలో 7.9 శాతం ఓట్లను పొందారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఐదు రాష్ట్రాల నుంచి 2,556 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేయగా అందులో ఏడుగురు విజయం సాధించారు.
 
మరిన్ని వార్తలు