'ఏదో ఒకరోజు వాళ్లు మనుషులుగా మారతారు'

9 May, 2015 13:26 IST|Sakshi
'ఏదో ఒకరోజు వాళ్లు మనుషులుగా మారతారు'

ఛత్తీస్గఢ్: ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశం ఏదైనా ఉంటే అది భారతదేశమే అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆయన శనివారం నక్సల్స్ కంచుకోట అయిన ఛత్తీస్గఢ్లోని దంతెవాడ ప్రాంతంలో తొలిసారి పర్యటించారు.  దిల్మిలి గ్రామంలో అల్ట్రా మెగా ఉక్కు కర్మాగారానికి, రావ్ఘాట్-జగదల్పూర్ రైల్వేలైన్ రెండోదశకు మోదీ శంకుస్థాపన చేశారు.అనంతరం పేద పిల్లలకు విద్యావకాశాలు అందించేందుకు ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ సిటీని సందర్శించారు.

ఈ సందర్భంగా మోదీ దంతెవాడ బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రపంచంలోని దేశాలన్నీ భారత్ను గుర్తిస్తున్నాయన్నారు. సేవ చేసే అవకాశాన్ని కల్పించిన ప్రజల ఆకాంక్షలను పూర్తి చేసేందుకు తాము ప్రయత్నిస్తున్నామన్నారు.  యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఇందుకోసం వివిధ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు.

ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్సింగ్ వల్ల విద్యార్థులకు మేలు జరిగిందని, తుపాకులకు బదులు విద్యార్థులకు కంప్యూటర్లు, పెన్నుల గురించి తెలిసిందన్నారు. మావోయిస్టుల కార్యకలాపాలు ఎన్ని జరిగినా నిరాశ చెందాల్సిన అవసరం లేదని స్థానికులకు స్థైర్యాన్ని ఇచ్చారు. అశాంతికి ఎప్పటికీ భవిష్యత్ లేదని, శాంతి వల్లే మేలు జరుగుతుందన్నారు. ఏదో ఒకరోజు మావోయిస్టులు కూడా మనుషులుగా మారతారని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు