దేశాభివృద్ధే మా ధ్యేయం

23 Feb, 2016 07:16 IST|Sakshi
దేశాభివృద్ధే మా ధ్యేయం

అఖిలపక్షంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు
నేటినుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
 
 సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం దేశ అభివృద్ధికి, రాజ్యాంగానికి కట్టుబడి పనిచేస్తుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య  పేర్కొన్నారు. మంగళవారం పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సోమవారం ఇక్కడ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. 26 పార్టీలకు చెందిన 40 మంది నేతలు సమావేశంలో పాల్గొన్నారు. వివిధ విశ్వవిద్యాలయాల్లో ఇటీవలి పరిణామాలపై పార్లమెంటులో లోతుగా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెంకయ్య ఉభయ సభలకు చెందిన వివిధ పార్టీల నేతలకు హామీ ఇచ్చారు. జేఎన్‌యూ, హెచ్‌సీయూ సంఘటనలు, రిజర్వేషన్ల డిమాండ్లపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న ప్రధాన బిల్లులైన జీఎస్టీ, రియల్ ఎస్టేట్ బిల్లులు ఆమోదం పొందేందుకు సహకరించాలని కోరారు.

కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత ఖర్గే మాట్లాడుతూ బిల్లుల ఆమోదంలో తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని, అయితే తాము లేవనెత్తే అంశాలపై సమగ్ర చర్చ జరగాలన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని అమలు చేయాలని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత సుజనా చౌదరి కోరారు. పంచాయతీ రాజ్ వ్యవహారాలపై రాజ్యసభ కమిటీని రాజ్యసభ ఛైర్మన్ అన్సారీ ఏర్పాటు చేశారు. సభ్యులుగా కేశవరావు(టీఆర్‌ఎస్), గరికపాటి మోహన్‌రావు(టీడీపీ), జైరాం రమేశ్(కాంగ్రెస్)లను నామినేట్ చేశారు.
 
 ప్రతిపాదించిన ఎజెండా..
 25న ప్రశ్నోత్తరాలు ముగిశాక రైల్వే మంత్రి రైల్వే బడ్జెట్ ప్రవేశపెడతారు.29న ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సాధారణ బడ్జెట్ ప్రవేశపెడతారు.

 చర్చ, ఆమోదానికి ఉన్న బిల్లులు..
► ఆర్థిక బిల్లు, 2016. 8    ఎనిమీ సంపత్తి(సవరణ, క్రమబద్ధీకరణ) బిల్లు.(ఆర్డినెన్స్ స్థానంలో). 8ది రీజనల్ సెంటర్ ఫర్ బయో-టెక్నాలజీ బిల్లు.8ఎన్నికల చట్టాలు(సవరణ) బిల్లు, 2016

 లోక్‌సభలో పెండింగ్‌లో ఉన్నవి..
► లోక్‌పాల్, లోకాయుక్త, సంబంధిత ఇతర చట్టాలు(సవరణ) బిల్లు, 2014

 లోక్‌సభ ఆమోదం పొంది, రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్నవి
► రాజ్యాంగ(నూటా ఇరవై రెండో సవరణ) బిల్లు, 2014-(జీఎస్టీ బిల్లు)
► ది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ బిల్లు, 2015. 8 పరిశ్రమల(అభివృద్ధి, నియంత్రణ) బిల్లు, 2015
► వినియోగ చట్టాలు(రద్దు) బిల్లు, 2015
► జాతీయ జల మార్గాల బిల్లు, 2015
► విజిల్ బ్లోయర్స్ రక్షణ (సవరణ) బిల్లు
► హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తుల(వేతనాలు, సర్వీసు షరతులు) సవరణ బిల్లు, 2015

 రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్న బిల్లులు
► రియల్ ఎస్టేట్(నియంత్రణ, అభివృద్ధి) బిల్లు, 2013
►  హైజాకింగ్ వ్యతిరేక బిల్లు, 2014

 కొత్తగా ప్రవేశపెట్టబోయే బిల్లులు
► రాజ్యాంగ(షెడ్యూలు కులాలు) ఉత్తర్వులు(సవరణ) బిల్లు.8    ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ బిల్లు.

>
మరిన్ని వార్తలు