ఆటో కంటే అంతరిక్ష యానమే చవక!

29 Sep, 2014 16:01 IST|Sakshi

మన దేశంలో ఎక్కడినుంచి ఎక్కడకు వెళ్లాలన్నా ఆటో ఎక్కితే కనీసం కిలోమీటరుకు పది రూపాయలు తీసుకుంటారు. కానీ.. అంతరిక్షంలో ఎక్కడో ఉన్న అంగారకుడి మీదకు మన 'మామ్'ను పంపడానికి అయ్యిన ఖర్చు ఎంతో తెలుసా.. కిలోమీటరకు కేవలం ఏడు రూపాయలే! ఈ విషయాన్ని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. అహ్మదాబాద్లో ఆటోవాలాలు కిలోమీటరకు 10 తీసుకుంటారని, కానీ మార్స్ మిషన్కు కిలోమీటరుకు 7 రూపాయలే ఖర్చయిందని ఆయన ఎన్నారైలతో జరిగిన భేటీలో తెలిపారు.

మానవరహిత స్పేస్క్రాఫ్ట్ అంగారకుడి మీదకు వెళ్లడానికి 65 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించింది. ప్రపంచంలో ఏ దేశమూ ఇంత తక్కువ ఖర్చుతో ప్రయోగాలు చేయలేదని, మన సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రవేత్తల కృషి పుణ్యమాని ప్రపంచంలోనే మనం తలెత్తుకుని నిలబడగలుగుతున్నామని ఆయన అన్నారు. మంగళ్యాన్లో ప్రతి ఒక్కటీ స్వదేశీ పరికరమేనని, హాలీవుడ్ సినిమా బడ్జెట్ కంటే తక్కువ ఖర్చుతో ప్రాజెక్టు పూర్తయిందని మోదీ చెప్పారు. గ్రావిటీ సినిమాను 100 మిలియన్ డాలర్లతో తీస్తే.. మన ప్రాజెక్టుకు 74 మిలియన్ డాలర్లే ఖర్చయిందన్నారు.

మరిన్ని వార్తలు