మన ఎంపీలు మనకంటే 1400 రెట్లు సంపన్నులు..

23 Jul, 2019 11:26 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఏ ఎన్నికలైనా పేదరిక నిర్మూలనే తమ అజెండా అని ఊదరగొట్టే నేతలు, ఓట్ల వేటలో పేదలను కౌగిలింతల్లో ముంచెత్తడం, వారి ఇంట్లో భోజనం చేయడం వంటి చర్యలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. అల్పాదాయ వర్గాలను ఆకట్టుకునేందుకు సంక్షేమ కార్యక్రమాలపై నినాదాలు వల్లెవేసే ఎంపీల్లో అసలు పేదలను ప్రతిబింబించే నేతలు ఉన్నారా అంటే దిక్కులు చూడాల్సిన పరిస్థితి.

దేశ ప్రజల సగటు ఆదాయంతో లోక్‌సభ ఎంపీల సగటు రాబడితో పోలిస్తే విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. మన ఎంపీలు మన ప్రజల కంటే 1400 రెట్లు అధిక రాబడిని ఆర్జిస్తున్నారని ఇండియా టుడే డేటా ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ విశ్లేషించింది. 2004 నుంచి 2019 వరకూ ఎన్నికైన ఎంపీల నికర ఆస్తులను లెక్కగట్టడం ద్వారా ఈ గణాంకాలను వెలువరించింది.

ఎంపీల సగటు ఆదాయం 2004-09లో కేవలం రూ 1.9 కోట్లు కాగా తర్వాతి కాలంలో రూ 5.06 కోట్లకు ఎగబాకగా 2014-19లో రూ 13 కోట్లకు ఎగిసింది. ఇక ప్రస్తుత 17వ లోక్‌సభ(2019-24)లో ఎంపీల సగటు ఆదాయం ఏకంగా రూ 16 కోట్లకు ఎగబాకింది. ఎంపీల సగటు ఆదాయం సామాన్య ప్రజల సగటు ఆదాయంతో పోలిస్తే ఇంత భారీ వ్యత్యాసం ఉండటానికి కారణం 2019 లోక్‌సభ ఎన్నికల్లో పెద్దసంఖ్యలో పారిశ్రామికవేత్తలు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడమేనని విశ్లేషకులు పేర్కొన్నారు.

రాజకీయ పార్టీలు నిధుల కోసం స్వయంగా భారీగా వెచ్చించే అభ్యర్ధుల వైపు మొగ్గుచూపడంతో వ్యాపారులు ఇబ్బడిముబ్బడిగా చట్టసభల్లో అడుగుపెడుతున్నారని ఇది పేదలు, చట్టసభ సభ్యుల రాబడిలో తీవ్ర అసమానతలు పెరిగే స్దాయికి దారితీస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు తమ పనులు చక్కబెట్టుకునేందుకు ప్రభుత్వాల్లో పట్టుపెంచుకునేందుకు పారిశ్రామికవేత్తలు రాజకీయ రంగంలోకి వస్తున్నారని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రియుడితో పారిపోయేందుకు భర్తను...

బాలుడికి హెచ్‌ఐవీ రక్తం ఎక్కిస్తారా?

కశ్మీర్‌పై ట్రంప్‌ వ్యాఖ్యలను ఖండించిన భారత్‌

ఏటీఎం మోసాలు అక్కడే ఎక్కువ

నేడే బల నిరూపణ!

ఆర్టీఐ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

మహిళా శక్తి @ చంద్రయాన్‌

చంద్రుడి గుట్టు విప్పేందుకే..!

భారత సంకల్పానికి నిదర్శనం

చంద్రుడిపై పరిశోధనలకు 60 ఏళ్లు!

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనే

అందరి చూపూ ఇక సెప్టెంబర్‌ 7 వైపు!

నిప్పులు చిమ్ముతూ...

చంద్రయాన్‌ -1కి చంద్రయాన్‌-2కి తేడా ఏంటి?

ఈనాటి ముఖ్యాంశాలు

ఆర్‌టీఐ సవరణ బిల్లుకు ఆమోదం

ఎంటీఎన్‌ఎల్‌ కార్యాలయంలో అగ్ని ప్రమాదం

సాధ్విని మందలించిన జేపీ నడ్డా!

‘బీజేపీ నా భర్తను వేధిస్తోంది’

మోదీ 2.0 : యాభై రోజుల పాలన ఇలా..

వచ్చే 24 గంటలు కీలకం: ఇస్రో చైర్మన్‌

జాబిలమ్మ మీదకు దూసుకెళ్లిన చంద్రయాన్‌–2

ఎన్నారై అనుమానాస్పద మృతి

ఇక పట్టాల పైకి దేశీ రైళ్లు

అశ్లీల చిత్రాలు చూపిస్తూ తండ్రి కొడుకు..

‘24 గంటల్లోనే కాంగ్రెస్‌లో చీలిక’

కైరానా ఎమ్మెల్యే ​వ్యాఖ్యలతో హైరానా..

ప్రజా ఉద్యమానికి దిగిరావాల్సిందే!

క్లైమాక్స్‌కు చేరిన కర్ణాటక రాజకీయం

మూడు నెలల్లో ఒక్క ఆడ శిశువు కూడా..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కమల్‌ సినిమాలో చాన్సొచ్చింది!

రొమాంటిక్‌ మూడ్‌లో ‘సాహో’

షుగర్‌లో త్రిష, సిమ్రాన్‌..!

ఫస్ట్‌రోజే ఫిట్టింగ్‌ పెట్టిన బిగ్‌బాస్‌

పెన్‌ పెన్సిల్‌

తమిళ నిర్మాతల వల్ల నష్టపోయా