అనుప్రియపై దాడి, 158 మందిపై కేసు

12 Sep, 2016 13:51 IST|Sakshi
అనుప్రియపై దాడి, 158 మందిపై కేసు

ప్రతాప్గఢ్: కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన కేసులో 158 మందిపై ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాణిగంజ్ పోలీసు స్టేషన్ లో కేసులు పెట్టారు. స్థానిక నాయకుడు వినోద్ దూబే సహా 157 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. అనుప్రియ పటేల్, అప్నా దళ్ కార్యకర్తల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించారన్న ఆరోపణలతో కేసు నమోదు చేసినట్టు చెప్పారు.

అనుప్రియ పటేల్ ఆదివారం ప్రతాప్గఢ్ జిల్లాలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె కాన్వాయ్ పై దుండగులు దాడి చేశారు. అధికార సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలే తన కాన్వాయ్పై దాడిచేశారని అనుప్రియ ఆరోపించారు. తమ రోడ్ షోను అడ్డుకోవాలన్న కుట్రతో తమపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. కేంద్ర మంత్రినైన తనకే రక్షణ లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు