బిహార్ లో పెద్ద ఎత్తున మద్యం స్వాధీనం

8 Apr, 2016 13:13 IST|Sakshi

లిక్కర్ బ్యాన్ నూరుశాతం అమలవుతున్న బీహార్లో దాడులు నిర్వహించిన అధికారులు వేల లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దేశీయ, విదేశీ మద్యం అక్రమ అమ్మకాలు జరుగుతున్నాయన్న పక్కా సమచారంతో దాడులు జరిపిన పోలీసులు 16 వేల లీటర్ల మద్యాన్ని సీజ్ చేసి, 44 మందిని అరెస్టు చేశారు.

కొత్త బీహార్ ఎక్సైజ్ సవరణ చట్టం 2016 ప్రకారం బీహార్ లోని మొత్తం 655 ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మద్య నిషేధం పూర్తి శాతం అమల్లో ఉన్న రాష్ట్రంలో అక్రమ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయన్న సమాచారంతో అధికారులు సోదాలు చేసినట్లు ఓం ప్రకాష్ మండల ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు.

14.108 దేశీయ, 2,386 లీటర్ల విదేశీ బ్రాండ్ల మద్యం బాటిళ్ళను సీజ్ చేసి... 44 మందిని  అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. మార్చి 31న బీహార్లో ఆమోదించిన బిల్లు ఫలితంగా... మద్యానికి వ్యతిరేకంగా నిర్వహించిన ఆపరేషన్ లో ఎక్సైజ్  పోలీసులు  ప్రోత్సాహక ఫలితాలను సాధించారు.

జిల్లాలో మద్య నిషేధానికి వ్యతిరేకంగా అమ్మకాలు జరుపుతున్న 24 మందిని అరెస్ట్ చేసినట్లు పాట్నా సీనియర్ సూపరింటిండెంట్ ఆఫ్ పోలీస్ మను మహరాజ్ ఓ ప్రకటనలో తెలిపారు. పూర్తిశాతం మద్య నిషేధాన్ని అమలు పరిచే నేపథ్యంలో వివిధ జిల్లాల్లోని డీ ఎడిక్షన్ కేంద్రాల నుంచి  వ్యసనపరుల నివేదికలు కూడ అందుకున్నట్లు ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు