2 కోట్లకు పైగా ఎన్‌95 మాస్కులు ఉచితం: కేంద్రం

3 Jul, 2020 19:12 IST|Sakshi

న్యూఢిల్లీ :   క‌రోనా నియంత్ర‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఏప్రిల్ 1 నుంచి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర సంస్థ‌ల‌కు క‌లిపి  2 కోట్లకు పైగా ఎన్95 మాస్కులు, 1.18 కోట్ల పీపీఈ కిట్లు, 11,000 వెంటిలేటర్లను ఉచితంగా సరఫరా చేసినట్లు శుక్ర‌వారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీనికి అదనంగా 11,300 'మేక్ ఇన్ ఇండియా' వెంటిలేటర్లను 6,154 ఆసుప‌త్రుల‌కు స‌ర‌ఫ‌రా చేసిన‌ట్లు తెలి‌పింది. క‌రోనా నియంత్ర‌ణకు అనుస‌రించాల్సిన చ‌ర్య‌ల‌పై కేంద్రం అన్ని రాష్ర్ట ప్ర‌భుత్వాల‌తో స‌మీక్షిస్తూ అవిశ్రామంగా కృషి చేస్తుంద‌ని ఆరోగ్య‌శాఖ  ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.  అంతేకాకుండా వివిధ ఆసుప‌త్రుల్లో కోవిడ్ క‌ట్ట‌డి కోసం ఏర్పాటుచేసిన సౌక‌ర్యాల‌ను పెంచ‌డంతో పాటు అనుబంధంగా వైద్ర సామాగ్రిని కేంద్రం ఉచితంగా అందిస్తోంద‌ని తెలిపింది. ఇప్ప‌టికే  1.02 లక్షల ఆక్సిజన్ సిలిండర్లు, 6.12కోట్లకు పైగా హెచ్‌సిక్యూ టాబ్లెట్ల‌ను స‌ర‌ఫ‌రా చేసిన‌ట్లు వెల్ల‌డించింది. (వ్యాక్సిన్‌పై ఐసీఎంఆర్‌ కీలక ప్రకటన )

‘దేశంలో క‌రోనా వెలుగు చూసిన కొత్త‌లో పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్కుల కోసం విదేశీ మార్కెట్‌పై ఆధార‌ప‌డాల్సి వ‌చ్చింది. అంతేకాకుండా ప్ర‌పంచవ్యాప్తంగా డిమాండ్ ఉండ‌టంతో వీటికి కొర‌త కూడా ఉండేది. అయితే అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ (డిపిఐఐటి), రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డిఆర్డిఓ), స‌హా మ‌రికొన్ని శాఖ‌ల స‌మ‌న్వ‌యంతో పిపీఈ కిట్లు, ఎన్95 కిట్లు, వెంటిలేట‌ర్లు స‌హా అత్య‌వ‌స‌ర సామాగ్రిని  దేశీయంగానే త‌యారుచేశాం. ఫ‌లితంగా 'ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్', 'మేక్ ఇన్ ఇండియా' ల‌కు బ‌లం చేకూర్చేలా మ‌న‌ దేశంలోనే వైద్య ప‌రిక‌రాల‌ను  త‌యారుచేశాం'’ అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. (మాస్క్‌ ఉన్నా  4 నిమిషాల్లోపైతేనే ‘లో రిస్క్‌’!  )

మరిన్ని వార్తలు