క్వారంటైన్‌కు త‌ర‌లిస్తున్న అధికారులు

1 Apr, 2020 16:20 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ:  లాక్‌డౌన్ కార‌ణంగా దేశ రాజ‌ధాని ప్రాంతంలోని మజ్ను కా తిల్లా ప్రాంతంలోని గురుద్వారాలో చిక్కుకున్న 200 మందికి పైగా సిక్కులను అధికారులు  నెహ్రూ విహార్ పాఠశాలలో క్వారంటైన్‌కు త‌ర‌లిస్తున్నారు. నిజాముద్దీన్‌లోని త‌బ్లీగి జ‌మాద్ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన వారిలో 24 మంది కోవిడ్‌-19 నిర్ధార‌ణ అయ్యింది. దీంతో  మొత్తం ఈ కార్య‌క్ర‌మాన‌కి ఎంత‌మంది హాజ‌ర‌య్యారు, వారు ఎవ‌రెవ‌రిని క‌లిశార‌న్న దానిపై రాష్ర్ట‌ప్ర‌భుత్వాలు డాటా సేక‌ర‌ణ ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యాయి. ఒకే చోట ఎక్కువ‌మంది గుమికూడ‌రాదు అన్న ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించి కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించిన మార్కాజ్ మతాధికారిపై కేసు నమోదైంది.
 

గురుద్వారాలో చిక్కుకున్న వారిలో ఎక్కువ‌మంది పంజాబ్‌కి  చెందిన సిక్కులున్నార‌ని, వారిని తిరిగి పంజాబ్‌కి ర‌ప్పించ‌డంలో ఆ రాష్ర్ట ముఖ్య‌మంత్రి అమ‌రీంద‌ర్ సింగ్ ఏమాత్రం చొర‌వ చూప‌లేద‌ని ఢిల్లీ సిక్కు గురుద్వారా క‌మిటీ ప్రెసిడెంట్ మ‌జీంద‌ర్ సింగ్ సిర్సా ఆరోపించారు. పాకిస్తాన్‌వాసులు కూడా గురుద్వారాలో చిక్కుకున్న‌వారిలో ఉన్న‌ట్లు గుర్తించామ‌ని తెలిపారు. ఇక క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఢిల్లీలో 120 కేసులు న‌మోదుకాగా వారిలో ఆరుగురు కోలుకున్నారు. ఇద్ద‌రు మృతిచెందారు. కోవిడ్‌-19కి బ‌ల‌వుతున్న వారిలో ఎక్కువ‌గా ఇంత‌కు మందే ఆరోగ్య స‌మ‌స్య‌లున్న‌వారు, చిన్న‌పిల్లలు, వృద్ధులు ఉన్నారు.  

మరిన్ని వార్తలు