రుణమాఫీ కోసం కదంతొక్కిన రైతన్న

22 Nov, 2018 05:33 IST|Sakshi

ముంబై:  రైతు రుణమాఫీ,  అటవీభూములపై గిరిజనులకు హక్కులు, కరువు సాయం  కోరుతూ వేలాదిమంది మహారాష్ట్ర రైతులు, గిరిజనులు నిరసనబాట పట్టారు. మెగసెసె అవార్డు గ్రహీత, వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియాగా పేరొందిన డాక్టర్‌ రాజేంద్రసింగ్‌ సైతం వీరి వెంట నడిచారు. ప్రధానంగా మరాఠ్వాడా, థానె, భుసావాల్‌ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు, గిరిజనులతో మంగళవారం మధ్యాహ్నం థానెలో ర్యాలీ ప్రారంభమైంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ముంబైలోని విధాన్‌ భవన్‌కు గురువారం చేరుకుని అక్కడ భారీస్థాయిలో నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు. రైతులందరికీ అందుబాటులో తగినంత భూమి, నీరు, సహజవనరులన్నీ దక్కాలని సూచించిన స్వామినాథన్‌ కమిటీ నివేదికను అమలుచేయాలని రైతులు డిమాండ్‌చేస్తున్నారు.  ప్రభుత్వం స్పందించకపోవడంతో ఉద్యమంబాట పట్టామని ర్యాలీకి నేతృత్వం వహిస్తున్న లోక్‌ సంఘర్‌‡్ష మోర్చా నేత ప్రతిభాషిండే చెప్పారు. 

మరిన్ని వార్తలు