బౌద్ధంలోకి 300 మంది హిందువులు

15 Mar, 2016 17:52 IST|Sakshi

బౌద్ధుల పుణ్యక్షేత్రమైన బుద్ధగయలో సుమారు 300 మంది వెనుకబడిన కులాలకు చెందిన హిందువులు బౌద్ధమతం స్వీకరించారు. కుల వివక్ష, అంటరానితనం వదిలించుకోవడం కోసమే తాము బౌద్ధమతంలో చేరినట్లు మతమార్పిడి చేసుకున్నవారు తెలిపారు.

బీహార్ లోని ఔరంగాబాద్, జహనాబాద్ జిల్లాలతోపాటు, మహరాష్ట్ర లోని నాగ్ పూర్, సతారా నగరాలనుంచి, మధ్యప్రదేశ్ జబల్ పూర్, రేవా నుంచి వచ్చిన వారంతా బౌద్ధంలో చేరినట్లు స్థానిక అధికారులు తెలిపారు. మయన్మార్ కు చెందిన బౌద్ధ సన్యాసి చంద్రముని, బుద్ధ గయలోని బర్మా విహార్ ఆశ్రమంలో జరిగిన దీక్షా కార్యక్రమంలో పాల్గొన్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. అయితే దీక్షా కార్యక్రమాన్ని నిర్వహించిన బాబా సాహెబ్ అంబేద్కర్ మిషన్... ఈ హిందువుల మతమార్పిడి కార్యక్రమంలో ప్రధాన పాత్ర పోషించినట్లు అధికారులు చెప్తున్నారు.

మరిన్ని వార్తలు