రాళ్లు విసిరేందుకు 300 వాట్సాప్‌ గ్రూపులు

24 Apr, 2017 11:49 IST|Sakshi
రాళ్లు విసిరేందుకు 300 వాట్సాప్‌ గ్రూపులు

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో చోటు చేసుకుంటున్న అల్లర్లు ఉద్దేశ పూర్వకంగా చేస్తున్నవేనని మరోసారి స్పష్టమైంది. పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చి శాంతిభద్రతలను నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్న బలగాలపైకి రాళ్లు విసురుతున్న ఆందోళనకారులు ఎప్పటికప్పుడు ముందుగా అనుకోనే దాడులకు దిగుతున్నట్లు తాజాగా తెలిసింది. దాదాపు 300 వాట్సాప్‌ గ్రూపుల ద్వారా తమను తాము నియంత్రించుకుంటూ ఆందోళన కారులు బలగాలపై రాళ్లదాడికి దిగుతున్నట్లు సెక్యూరిటీ ఫోర్సెస్‌ నుంచి సమాచారం అందుతోంది.

ఇందులో 90శాతం వరకు వాట్సాప్‌ గ్రూపులు ఇప్పటికే మూసివేశారని కూడా సమాచారం. ప్రతి ఒక వాట్సాప్‌ గ్రూపులో 250 మంది ఉన్నట్లు కూడా తెలిసింది. బలగాలు అడుగు వేస్తే వెంటనే ఆ సమాచారాన్ని చేరవేసేలా వాట్సాప్‌ గ్రూపులను కొనసాగిస్తున్నారు. ‘వాట్సాప్‌ గ్రూపుల్లో ఎవరున్నారో, వాటిని నడిపేదెవరో మా దగ్గర సమాచారం ఉంది. అందులో ఇప్పటికే చాలామందిని పోలీస్‌ స్టేషన్‌కు పిలిచి కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపిస్తున్నాం. దీనికి మంచి స్పందన కూడా వస్తోంది’  అని చెప్పారు. సోమవారం జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యి ప్రస్తుతం కశ్మీర్‌ పరిస్థితులపై చర్చించనున్నారు.

మరిన్ని వార్తలు