చిన్నారుల్లో ఆ వ్యాధులు మళ్లీ విజృంభిస్తాయేమో?

25 May, 2020 06:19 IST|Sakshi

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ కారణంగా చిన్నారులకు సాధారణంగా ఇచ్చే వ్యాక్సిన్‌ కార్యక్రమానికి ఆటంకం కలగడంపై ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్లుగా పిల్లలకు క్రమం తప్పకుండా వేస్తున్న టీకా కార్యక్రమం రెండు నెలలుగా నిలిచిపోవడంతో పాత శత్రువులైన డిఫ్తీరియా, ధనుర్వాతం, తట్టు, పోలియో మళ్లీ తిరగబెట్టే ప్రమాదముందని అంటున్నారు. కోవిడ్‌–19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 8 కోట్ల మంది ఏడాదిలోపు చిన్నారులు డిఫ్తీరియా, తట్టు, పోలియో వ్యాధుల బారిన పడే ప్రమాదముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ఒక నివేదికలో తెలిపింది. భారత్‌లో ప్రతినెలా 20 నుంచి 22 లక్షల మంది చొప్పున ఏడాదికి 2.60 కోట్ల మంది చిన్నారులకు జాతీయ టీకా కార్యక్రమం కింద వ్యాక్సినేషన్‌ జరుగుతుందని తెలిపింది. 

మరిన్ని వార్తలు