బ్యాంకులో రెండు కోట్లు గల్లంతు!

4 Apr, 2015 20:02 IST|Sakshi
బ్యాంకులో రెండు కోట్లు గల్లంతు!

ఓ బ్యాంకులో రూ.2.77 కోట్లు గల్లంతయ్యాయి. అంతేకాదు నగదుతోపాటు బ్యాంకు సెక్యూరిటీ గార్డు, ఇద్దరు ఉద్యోగులు కూడా కనిపించకుండాపోయారు! ఉత్తరప్రదేశ్ దెఒరియా జిల్లా కేంద్రంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో జరిగిన ఈ ఘటనను పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తుచేస్తున్నారు.

కార్యకలాపాలు పూర్తయిన తర్వాత నగదు నిల్వలన్నింటినీ లాకర్లలో ఉంచడం బ్యాంకు సిబ్బంది రోజూ చేసేదే. కానీ ఆర్థిక సంవత్సరం ఆఖరు రోజైన మార్చి 31న పని ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో రూ2.77 కోట్లను క్యాష్ కౌంటర్ లోని బాక్స్ లో ఉంచి ఇళ్లకు వెళ్లిపోయారు. ఏప్రిల్ 1 సెలవు కావడంతో రెండో తేదీన నగదు గల్లంతైనట్లు గుర్తించామని బ్యాంకు అధికారి వినోద్ కుమార్ సింగ్ పేర్కొన్నారు.

ఓ దుండగుడు నగదు ఎత్తుకెళ్లడం సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయిందని, అతడి ఆనవాళ్లు.. కనిపించకుండాపోయిన సెక్యూరిటీగార్డును పోలి ఉన్నాయని దెఒరియా ఎస్సీ మనోజ్ కుమార్ చెప్పారు. అన్ని కోణాల్లో దర్యాప్తు సాగుతోందని, త్వరలోనే నిందితుల్ని అరెస్టు చేస్తామని అన్నారు.

మరిన్ని వార్తలు