ఆదానీ ఆస్పత్రిలో వెయ్యి మంది చిన్నారుల మృతి!

21 Feb, 2019 11:23 IST|Sakshi

గాంధీనగర్‌: ఆదానీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలోని ఓ ఆస్పత్రిలో గత ఐదేళ్ల కాలంలో వెయ్యి మందికిపైగా చిన్నారులు మరణించారు. కఛ్‌ జిల్లా బూజ్‌ పట్టణంలోని జీకే ఆస్పత్రిలో ఈ మరణాలు చోటుచేసుకున్నాయి. ఈ విషయాన్ని గుజరాత్‌ డిప్యూటీ సీఎం, ఆరోగ్య శాఖ మంత్రి నితిన్‌ పటేల్‌ బుధవారం శాసనసభలో వెల్లడించారు. 

క్వశ్చన్‌ అవర్‌ సయమంలో ఓ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు నితిన్‌ పటేల్‌ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. జీకే ఆస్పత్రిలో గడిచిన ఐదేళ్ల కాలంలో 1,018 మంది చిన్నారులు చనిపోయినట్టు తెలిపారు. 2014-15లో 188 మంది, 2015-16లో 187 మంది, 2016-17లో 208 మంది, 2017-18లో 276 మంది, 2018-19(ఇప్పటివరకు) 159 మంది చిన్నారులు చనిపోయినట్టు వెల్లడించారు. జీకే ఆస్పత్రిలో చిన్నారుల మరణాలపై దర్యాప్తు చేపట్టడానికి గత ఏడాది మే నెలలో కమిటీని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ కమిటీ తన నివేదికలో పిల్లల మరణాలకు వేర్వేరు కారణాలను పేర్కొందన్నారు. చనిపోయినవారిలో ఆ ఆస్పత్రిలో జన్మించిన శిశువులతోపాటు, అక్కడికి రిఫర్‌ చేయబడిన చిన్నారులు కూడా ఉన్నారని తెలిపారు.

మరిన్ని వార్తలు