చిదంబరంను ప్రశ్నించిన ఈడీ 

9 Feb, 2019 02:33 IST|Sakshi

న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్‌ మీడియాకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో మాజీ ఆర్థిక మంత్రి చిదంబరంను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) శుక్రవారం ప్రశ్నించింది. ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వచ్చిన ఆయనను అధికారులు దాదాపు 3గంటలపాటు విచారించారు. ఇదే కేసు విషయంలో కొడుకు కార్తిని గురువారం 6గంటలపాటు ప్రశ్నించింది. కార్తికి దేశవిదేశాల్లోని రూ.54 కోట్ల విలువైన ఆస్తులను ఈ కేసులో అటాచ్‌ చేసింది.

2007లో చిదంబరం కేంద్ర మంత్రిగా ఉన్నపుడు ఐఎన్‌ఎక్స్‌ మీడియాలో రూ.305 కోట్ల విదేశీ పెట్టుబడుల కోసం ఫారెన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు నిబంధనలను అతిక్రమించారని ఈడీ ఆరోపించింది. ఈ కేసులో సీబీఐ నిందితులుగా పేర్కొన్న కార్తి, ఐఎన్‌ఎక్స్‌ మీడియా డైరెక్టర్లు పీటర్, ఇంద్రాణి ముఖర్జీపై ఈడీ కేసు పెట్టింది. కార్తి తన పలుకుబడిని ఉపయోగించి ఐఎన్‌ఎక్స్‌ మీడియాకు ఎఫ్‌ఐఎఫ్‌బీ క్లియరెన్స్‌ ఇప్పించడం కోసం ముడుపులు స్వీరించారనే ఆరోపణలతో సీబీఐ గతేడాది ఫిబ్రవరి 28న ఆయనను అరెస్టు చేసింది. అనంతరం ఆయన బెయిల్‌పై బయటకి వచ్చారు.   

మరిన్ని వార్తలు