‘గల్వాన్‌ లోయ మాదే.. చైనా అద్భుత డిమాండ్‌’

25 Jun, 2020 12:14 IST|Sakshi

న్యూఢిల్లీ : భారత్‌-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరుకున్నాయి. గల్వాన్‌ లోయ ఘర్షణ అనంతరం పొరుగు దేశం చైనా తన వంకర బుద్ధిని మార్చుకోవడం లేదు. ఓ వైపు చర్చల పేరుతో శాంతియుతంగా ఉద్రిక్తలను తగ్గించుకుందాం అని చెబుతూనే మరోవైపు కయ్యానికి కాలు దువ్వుతోంది. బుధవారం లడఖ్‌లోని గల్వాన్‌ లోయ తమదేనని చైనా మరోసారి వ్యాఖ్యలు చేసింది. కాగా దీనిపై గురువారం కాంగ్రెస్‌ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం స్పందించారు.(అమెరికా: వారి నుంచి అధిక రుసుం వసూలు)

ఏప్రిల్‌- జూన్‌ నెలలో చైనా బలగాలు భారత స్థితిని మార్చాయనే విషయం కాదనలేనిదన్నారు. భారత్‌ను యథాతథా స్థితిని పునరుద్ధరించడంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఏన్డీఏ ప్రభుత్వం విజయం సాధిస్తుందా అని ప్రశ్నించారు. ఈ మేరకు ట్విటర్‌లో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ, పీఎల్‌ఏఎ గల్వాన్‌ లోయ తమదేనని నొక్కి చెప్పాయి. భారత్‌ గల్వాన్‌ లోయను ఖాళీ చేయాలని డిమాండ్ చేసింది. అద్భుత డిమాండ్‌ అంటూ ట్వీట్‌ చేశారు. (6 లక్షల డాలర్లు లూటీ; ఎన్నారై డాక్టర్‌ అరెస్ట్‌)

మరిన్ని వార్తలు