ఎయిమ్స్‌కు చిదంబరం

28 Oct, 2019 18:53 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ఈడీ కస్టడీలో ఉన్న కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరంను అస్వస్థతతో బాధపడుతుండటంతో సోమవారం సాయంత్రం ఎయిమ్స్‌కు తరలించారు. కడుపు నొప్పికి చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ వెళ్లేందుకు రెండు రోజులు బెయిల్‌పై అనుమతించాలని గత వారం కోర్టు విచారణ సందర్భంగా చిదంబరం కోరారు. చికిత్స అనంతరం తన కస్టడీని కొనసాగించవచ్చని చెప్పారు. వైద్యం కోసం ఆయనను ఎయిమ్స్‌కు తీసుకువెళతామని ఈడీ పేర్కొంది. మరోవైపు కడుపు నొప్పితో బాధపడుతున్నట్టు చిదంబరం తెలుపగా ఆయనను ఆర్‌ఎంఎల్‌ ఆ‍స్పత్రికి తీసుకువెళ్లిన ఈడీ బృందం సాయంత్రం ఎయిమ్స్‌కు తరలించింది. ఐఎన్‌ఎక్స్‌ కేసులో చిదంబరం ఈనెల 30 వరకూ ఈడీ కస్టడీలో కొనసాగుతారు.

మరిన్ని వార్తలు