రైల్వే ఉద్యోగాలా? ఇది మరో జుమ్లా - చిదంబరం

24 Jan, 2019 15:48 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రానున్న రెండేళ్లలో నాలుగు లక్షల రైల్వే ఉద్యోగాలు కల్పిస్తామన్న  రైల్వే మంత్రి  పియూష్‌ గోయల్‌ ప్రకటనపై మాజీ కేంద్ర మంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత చిదంబరం స్పందించారు.  ఇదొక నెరవేరని హామీగా ఆయన అభివర్ణించారు. ఉద్యోగాలను కల్పించడంలో విఫలమైన రైల్వే శాఖ హఠాత్తుగా నిద్రలేచిందంటూ విమర్శించారు.

గత  ఐదేళ్లుగా రైల్వేలో దాదాపు 2,82,976 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇపుడు అకస్మాత్తుగా ఈ మూడు నెలల్లోనే ఆ ఖాళీలను భర్తీ చేస్తామని ఇప్పుడు మోదీ సర్కారు  ప్రకటస్తుందంటూ ఎద్దేవా చేశారు.  ఇది మరో జుమ్లా అని ట్వీట్‌ చేశారు. అనే ప్రభుత్వ విభాగాల్లో  ఇదే ధోరణి ఉంది. ఒక వైపు ఖాళీగా ఉన్న పోస్టులు, మరొకవైపు నిరుద్యోగ  యువత అంటూ ఆయన ట్వీట్‌ చేశారు.  

కాగా 2020 నాటికి రైల్వేలో నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, రానున్న రెండేళ్లలో ప్రస్తుతం ఖాళీ ఉన్న పోస్టుల భర్తీ చేస్తామని రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు