ఎయిమ్స్‌కు చిదంబరం

29 Oct, 2019 03:10 IST|Sakshi

న్యూఢిల్లీ: తీహార్‌ జైల్లో ఉన్న ఆర్థిక శాఖ మాజీ మంత్రి∙చిదంబరానికి  కడుపునొప్పి రావడంతో ఎయిమ్స్‌కు సోమవారం తరలించారు. చికిత్స ముగిశాక తిరిగి జైలుకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన ఈడీ పర్యవేక్షణలో ఐఎన్‌ఎక్స్‌ కేసుకు సంబంధించి తీహార్‌ జైల్లో ఉన్నారు. మొదట ఆర్‌ఎమ్మెల్‌ ఆస్పత్రికి తరలించారు. అనంతరం సాయంత్రం సమయంలో ఎయిమ్స్‌కు పంపించి, అక్కడి వైద్యులతో చికిత్స చేయించారు. ఇదంతా ముగిశాక ఏడు గంటలప్పుడు తిరిగి జైలుకు తీసుకెళ్లారు. ఆయనకున్న సమస్యను డాక్టర్లు వెల్లడించడంలేదు.

మరిన్ని వార్తలు