భద్రత నడుమ ‘పద్మావత్‌’

26 Jan, 2018 01:59 IST|Sakshi
పట్నాలో సినిమా వ్యతిరేక నినాదాలు చేస్తున్న ఆందోళనకారులు

దేశవ్యాప్తంగా విడుదలైన సినిమా

పోలీసులు, బౌన్సర్ల రక్షణ వలయంలో థియేటర్లు

ఆ నాలుగు రాష్ట్రాల్లో చెదురుమదురు సంఘటనలు

న్యూఢిల్లీ/ముంబై: రెండు నెలలుగా విడుదలకు ఊరిస్తున్న పద్మావత్‌ చిత్రం పటిష్టమైన భద్రత నడుమ గురువారం దేశవ్యాప్తంగా విడుదలైంది. మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్తాన్, గోవా మినహా మిగిలిన రాష్ట్రాల్లో చిత్రాన్ని ప్రదర్శించారు. గుర్గావ్‌లో భారీ సంఖ్యలో సినిమాభిమానులు థియేటర్ల ముందు బారులు తీరారు. సినిమా చూసిన వారు.. ఆందోళలనలు అర్థరహితమని, చిత్రంలో నిరసన చేపట్టాల్సిన సన్నివేశాలేమీ లేవని పేర్కొన్నారు. గుర్గావ్‌లో చిత్ర విడుదల సందర్భగా మాల్స్, సినీప్లెక్స్‌లు, సింగిల్‌ స్క్రీన్‌ హాల్స్‌ వద్ద పోలీసులతోపాటు బౌన్సర్లతో పటిష్టమైన భద్రతను ఏర్పాటుచేశారు. 

పద్మావత్‌ చిత్రాన్ని విడుదలైన తొలిరోజే 10 లక్షల మంది వీక్షించారని ఈ చిత్ర నిర్మాణ సంస్థ వయాకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌ తెలిపింది.   రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లలో చిత్రం విడుదల కానప్పటికీ అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నాయి. మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో కర్ణిసేన బంద్‌ పాక్షికంగానే కొనసాగింది. చిత్ర విడుదలకు సంబంధించి దాఖలైన పిటిషన్‌లను విచారించేందుకు సుప్రీంకోర్టు ఓకే చెప్పింది.

మరిన్ని వార్తలు