ఉగ్రవాద కర్మాగారం గా పాకిస్థాన్

19 Sep, 2016 19:41 IST|Sakshi
ఉగ్రవాద కర్మాగారం గా పాకిస్థాన్

న్యూఢిల్లీ:  పాకిస్థాన్ ప్రపంచానికి ఉగ్రవాదులను ఎగుమతి చేసే  కర్మాగారంగా మారిందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ విమర్శించారు. ఢిల్లీలోని ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన సోమవారం మాట్లాడుతూ .. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న కారణంగానే ప్రపంచ వ్యాప్తంగా శాంతి, సుస్థిరతలకు విఘాతం కలుగుతోందని అన్నారు.  ఆ దేశ ఫ్యాక్టరీ నుంచి వస్తున్న కాలుష్యం ప్రపంచ వాతావరణాన్ని కలుషితం చేస్తోందని పేర్కొన్నారు.

భారతదేశం ఎప్పుడూ పొరుగు దేశానికి స్నేహహస్తాన్ని అందిస్తుందని అన్నారు. కానీ పాక్ మాత్రం భారత వ్యతిరేక విధానాలను తమ విదేశాంగవిధానంలో భాగంగా చేసుకుందని ఇందుకు ఆ దేశం భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆదివారం వేకువజామున నలుగురు పాక్ ముష్కరులు జమ్ములోని యూరీ సెక్టార్ లోని ఆర్మీ బేస్ క్యాంపుపై  పై దాడికి దిగిన ఘటనలో తాజాగా ఒక సైనికుడు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య మొత్తం 18 కి చేరుకుంది. గాయపడ్డ 20 మంది సైనికులు చికిత్స పొందుతున్నారు.
 

మరిన్ని వార్తలు