'పాక్ ఆక్రమిత కశ్మీర్ ఆ దేశానిదే'

27 Nov, 2015 16:30 IST|Sakshi
'పాక్ ఆక్రమిత కశ్మీర్ ఆ దేశానిదే'

శ్రీనగర్: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ ఆ దేశంలోనే అంతర్భాగంగా ఉంటుందని జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా అన్నారు. భారత్లోని జమ్ము కశ్మీర్ భూభాగం దేశంలో ఉంటుందని, ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించారు. 'కశ్మీర్ సమస్యకు యుద్ధం పరిష్కారం కాదు. ప్రాణాలు మాత్రమే కోల్పోతాం. చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలి' అని ఫరూక్ అబ్దుల్లా శుక్రవారం అన్నారు.   

ఫరూక్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండి పడ్డారు. 'ఇదో అబద్ధపు ప్రకటన. పాకిస్థాన్ ఆధీనంలోని కశ్మీర్, ఆ దేశం అక్రమంగా స్వాధీనం చేసుకున్నది' అని కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి, బీజేపీ ఎంపీ ఆర్కే సింగ్ అన్నారు. కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ స్పందిస్తూ.. కశ్మీర్ సమస్యపై 1994లో పార్లమెంట్లో ఏకగ్రీవ తీర్మానం చేసిన విషయాన్ని మరచిపోరాదని చెప్పారు. ఈ విషయంపై ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ఉందని, దీనిపై బిన్న వైఖరి లేదని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు