పాక్‌ కాల్పుల్లో 11కు చేరిన మృతులు

22 Jan, 2018 03:16 IST|Sakshi
జమ్మూలో దెబ్బతిన్న తన ఇంటిని చూసుకుంటున్న మహిళ

జమ్మూ: పాకిస్తాన్‌ వరుసగా నాలుగోరోజూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. నియంత్రణ రేఖ(ఎల్వోసీ)తో పాటు అంతర్జాతీయ సరిహద్దు వెంట ఉన్న జమ్మూ, కథువా, సాంబా, పూంచ్, రాజౌరీ ప్రాంతాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడి సైనిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీకే రాయ్‌ ప్రాణాలు కోల్పోయినట్లు ఓ పోలీస్‌ ఉన్నతాధికారి తెలిపారు.

దీంతో గత నాలుగు రోజుల్లో పాక్‌ కాల్పుల్లో చనిపోయిన వారి సంఖ్య 11కు చేరుకుందన్నారు. చనిపోయినవారిలో ముగ్గురు ఆర్మీ, ఇద్దరు బీఎస్‌ఎఫ్‌ జవాన్లతో పాటు ఆరుగు రు పౌరులున్నారు. సరిహద్దు ప్రాంతాల్లోని 40,000 మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. గణతంత్ర వేడుకల వేళ అలజడి సృష్టించేందుకు నలుగురు ఉగ్రవాదులు కశ్మీర్‌లోకి ప్రవేశించవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి.

మరిన్ని వార్తలు