భారత్‌లో ఉగ్రదాడులకు అవకాశం

3 Oct, 2019 04:27 IST|Sakshi

వాషింగ్టన్‌: భారత్‌లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని అమెరికా వెల్లడించింది. జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370, 35ఏ రద్దు నిర్ణయాలతో పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు భారత సరిహద్దుల వద్ద దాడులకు తెగబడే అవకాశం ఉందని పేర్కొంది. మిలిటెంట్‌ గ్రూపులను పాక్‌ కట్టడి చేయని పక్షంలో భారత్‌పై ఉగ్రమూకలు మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉందని ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని తెలిపింది. ఈ విషయంలో చైనా పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చే అవకాశం లేదని తాము భావిస్తున్నట్లు అమెరికా రక్షణ శాఖ ఇండో పసిఫిక్‌ విభాగం అసిస్టెంట్‌ సెక్రటరీ రాండాల్‌ శ్రీవర్‌ వెల్లడించారు. కశ్మీర్‌ విషయంలో కేవలం దౌత్య, రాజకీయాలకు సంబంధించిన అంశాలపై మాత్రమే పాక్‌కు చైనా అండగా ఉంటుందని శ్రీవర్‌ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ వేదికలపై పాక్‌కు చైనా మద్దతుగా నిలిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

మరిన్ని వార్తలు