కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్‌ తూట్లు

15 Aug, 2019 18:40 IST|Sakshi

పూంచ్‌(జమ్మూ కశ్మీర్‌) : పాకిస్తాన్‌ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తుట్లు పొడిచింది. సరిహద్దుల్లో శాంతి కోసం భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే.. దాయాది దేశం మాత్రం ఎప్పటిలానే తన బుద్ధిని ప్రదర్శించింది. గురువారం పూంచ్‌ జిల్లాలోని కృష్ణా ఘాటీ సెక్టార్‌ నంగి టేక్రీ ప్రాంతంలో పాక్‌ బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. అయితే వెంటనే అప్రమత్తమైన భారత బలగాలు పాక్‌ కాల్పులను సమర్ధవంతంగా తిప్పికొట్టాయి.

ఈ ఘటనపై స్థానికులు మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్యదినోత్సవం రోజున ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న పాక్‌కు సరైన రీతిలో బదులు చెప్పాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. అలాగే ఇలాంటి ఘటనలను భారత్‌ చూస్తూ ఊరుకోదని పాక్‌ను హెచ్చరించారు.

మరిన్ని వార్తలు