కరోనా కట్టడిలో యూపీ భేష్‌.. పాక్‌ మీడియా

8 Jun, 2020 14:22 IST|Sakshi

లక్నో: కరోనా కట్టడి కోసం ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ తీసుకుంటున్న చర్యలు చాలా అద్భుతంగా ఉన్నాయంటూ పాక్‌ మీడియా ప్రశంసలు కురిపిస్తుంది. పాకిస్తాన్ 'డాన్' వార్తాపత్రిక సంపాదకుడు ఫహద్ హుస్సేన్, కరోనా కట్టడి కోసం ఉత్తర ప్రదేశ్ లాక్‌డౌన్‌ను ఎంత కఠినంగా అమలు చేసిందో.. పాక్‌ ఎలా వదిలేసిందో గ్రాఫ్‌లతో వివరిస్తూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన.. పాకిస్తాన్ జనాభా 20కోట్లకు పైగా  ఉండగా ఉత్తరప్రదేశ్‌ జనాభా సుమారు 22 కోట్లు. అయితే పాక్‌లో కరోనా మరణాల రేటు.. యూపీ కంటే ఏడు రెట్లు ఎక్కువగా ఉన్నాయని ఆయన తెలిపారు. కరోనా కట్టడిలో యూపీ పనితీరును మెచ్చుకున్న ఆయన.. మహారాష్ట్ర పనితీరును విమర్శించారు. (ఆస్ప‌త్రి నిర్ల‌క్ష్యం..400 మంది క్వారంటైన్)

మరో ట్వీట్‌లో.. ‘భారత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో.. పాకిస్తాన్ కంటే తక్కువ మరణాల రేటు ఉంది. అలానే మహారాష్ట్రలో యువ జనాభా, జీడీపీ అధికంగా ఉన్నప్పటికి ఆ రాష్ట్రంలో మరణాల రేటు అధికంగా ఉంది. కరోనా కట్టడి కోసం యూపీ సరిగ్గా ఏమి చేసిందో.. మహారాష్ట్ర ఏమి చేయలేదో మనం తెలుసుకోవాలి. సరైన నిర్ణయాలు తీసుకోనందున మహారాష్ట్ర, పాక్‌ తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటున్నాయి’ అంటూ ట్వీట్‌ చేశారు. ఫహద్‌ యోగి ప్రభుత్వాన్ని ప్రశంసించడం పట్ల మిశ్రమ స్పందన వెలువడుతుంది. కొందరు ఫహద్‌ను మెచ్చు​కోగా.. మరికొందరు విమర్శిస్తున్నారు.

మరిన్ని వార్తలు