మాజీ సీఎంకు రెండో స్థానం

23 May, 2015 12:01 IST|Sakshi

చెన్నై: అన్నా డీఎంకే నేత పన్నీరు సెల్వంకు ఊహించని విధంగా రెండుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. అన్నా డీఎంకే అధినేతి జయలలిత అవినీతి కేసులో పదవి నుంచి వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడటంతో తనకు నమ్మినబంటయిన సెల్వంను సీఎం పీఠంపై కూర్చోబెట్టారు.

కర్ణాటక హైకోర్టు జయలలితను నిర్దోషిగా ప్రకటించడంతో 'అమ్మ' ముఖ్యమంత్రి అయ్యేందుకు వీలుగా సెల్వం రాజీనామా చేశారు. శనివారం ఉదయం జయలలిత ఐదోసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. జయ తన కేబినెట్లోకి సెల్వంను తీసుకున్నారు.  జయ కేబినెట్లో సెల్వంది రెండోస్థానం. ఆయనకు కీలకమైన ఆర్థిక శాఖను కేటాయించారు. తమిళనాడు గవర్నర్ రోశయ్య.. జయతో పాటు  28 మందితో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు.

మరిన్ని వార్తలు