పన్నీర్ 95.. శశికళ 5!

10 Feb, 2017 12:30 IST|Sakshi
పన్నీర్ 95.. శశికళ 5!

చెన్నై: తమిళనాడు రాజకీయాలపై రాష్ట్ర ప్రజలతో పాటు దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సోషల్ మీడియా సైట్ ట్విట్టర్ లో సీఎంగా పన్నీర్ సెల్వం కొనసాగాలా.. మార్పు జరగాలా అని పోల్ సర్వే నిర్వహించారు. పన్నీర్ సెల్వానికే పట్టం కట్టాలని రాష్ట్ర ప్రజలు అభిప్రాయపడుతున్నారు. తమిళనాడుకు నాయకత్వం వహించడానికి పన్నీర్ సెల్వం కొనసాగాలని 'సీఎంవో తమిళనాడు' వేదికగా జరిగిన ట్విట్టర్ ఖాతాలో 95 శాతం నెటిజన్లు తమ మద్ధతు తెలుపుతూ ఓటేశారు. కేవలం 5శాతం మంది మాత్రమే పన్నీర్ కు వ్యతిరేకంగా పోల్ సర్వేలో ఓటేశారు. అంటే ఐదు శాతం మంది మాత్రమే శశికళ సీఎం కావాలని కోరుకుంటున్నారు. మొత్తంగా 52,876 మంది తమ అభిప్రాయాన్ని వెల్లడించి ఈ సర్వేలో పొల్గొన్నారు. .

అనూహ్య మలుపులు తిరుగుతున్న తమిళనాడు రాజకీయాలు చివరికి గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావును చేరాయి. గురువారం సాయంత్రం 5 గంటలకు ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం, రాత్రి ఏడున్నర సమయంలో అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ వీకే శశికళ గవర్నర్ ను కలిసిన విషయం తెలిసిందే. బల నిరూపణకు తనకు అవకాశం ఇవ్వాలని పన్నీర్ కోరగా.. మెజారిటీ ఎమ్మెల్యేల మద్ధతు తనకే ఉందని, సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించాలని శశికోళ కోరారు. అయితే విద్యాసాగర్ రావు మాత్రం తన నిర్ణయాన్ని వెల్లడించకుండా, కేంద్రానికి నివేదిక పంపారు. పన్నీర్ సెల్వంతో పాటు శశికళ కూడా తానే సీఎం అవుతామని ధీమాగా ఉండటం గమనార్హం.

 

మరిన్ని వార్తలు