దర్యాప్తు కమిషన్‌ ముందు హాజరవుతా: పన్నీర్‌ సెల్వం

4 Jul, 2019 22:29 IST|Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నాయకురాలు జయలలిత మృతిపై అనుమానాలున్నాయని తాను ఆనాడే చెప్పానని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. జయలలిత హాస్పిటల్‌లో ఉన్నప్పుడు చూసేందుకు కూడా నన్నుఅనుమతించలేదని, ఆమె మృతిపై దర్యాప్తు చేయాలని తాను కోరానని గుర్తుచేశారు. ‘అమ్మ’ మృతిపై దర్యాప్తు చేస్తున్న జస్టిస్‌ అర్ముగస్వామి  కమిషన్‌ తనను విచారణకు హాజరుకావాలని నాలుగు సార్లు కోరిందనీ, కానీ పని ఒత్తిడి వల్ల వెళ్లలేకపోయాననీ స్పష్టం చేశారు. ఈ సారి పిలిస్తే కచ్చితంగా వెళ్తానని తెలియజేశారు.  కాగా,  జయలలిత మృతికి సంబంధించిన వివరాలు ఇవ్వడానికి ఇంకొంత సమయం కావాలని తమిళనాడు ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు జులై ఒకటిన అనుమతించింది. ఆ తర్వాత కొద్ది రోజుల వ్యవధిలో  పన్నీర్‌ సెల్వం ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

మరిన్ని వార్తలు