దీపా మలిక్ పట్ల దురుసు ప్రవర్తన

6 Oct, 2016 09:52 IST|Sakshi
దీపా మలిక్ పట్ల దురుసు ప్రవర్తన
న్యూఢిల్లీ: పారా ఒలింపిక్ రజత పతక విజేత దీపా మలిక్ పట్ల ఎయిర్ లైన్స్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. వీల్ చైర్ సర్వీస్, క్యాబిన్ క్రౌ సిబ్బంది తన పట్ల దురుసుగా వ్యవహరించిన తీరుపై ఆమె డొమెస్టిక్ విమానయాన సంస్థ విస్తారాకు ఫిర్యాదు చేశారు. టాటా గ్రూప్, సింగపూర్ కు చెందిన సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న యూకే 902 విమానంలో ఢిల్లీ నుంచి ముంబైకి మంగళవారం బయలుదేరారు.

ఫిజికల్ హ్యాండీక్యాప్ వ్యక్తులను వీల్ చైర్ నుంచి సీట్లోనికి చేరవేయడం సరిగాలేదని, ఫ్లైట్ ఆలస్యంపై సిబ్బందిని అడగ్గా గట్టిగా అరిచి సమాధానం చెప్పారని దీపా పేర్కొన్నారు. ఈవిషయంలో విస్తారా తగుచర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ఆమె ఫీడ్ బ్యాక్ బుక్కులో రాశారు. దీనిపై స్పందించిన విస్తారా సీఈఓ మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని దీనిపై పర్సనల్ గా విచారణ జరుపుతానని ఆమెకు హామీ ఇచ్చారు.
 
Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు