పుల్వామా దాడి : హోలీకి కేంద్ర బలగాలు దూరం

20 Mar, 2019 19:08 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో ఫిబ్రవరి 14న జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మరణించిన క్రమంలో సీఆర్‌పీఎఫ్‌కు బాసటగా పది లక్షల మందికి పైగా సైనికులతో కూడిన కేంద్ర సాయుధ దళాలు దేశవ్యాప్తంగా హోలీ వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించాయి. సరిహద్దు భద్రతా దళం, ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం, సస్త్ర సీమా బల్‌లు ఈ ఏడాది హోలీని జరుపుకోరాదని నిర్ణయించాయి. 

కాగా, చత్తీస్‌గఢ్‌లోని సుక్మా దాడి ఘటన నేపథ్యంలో 2017లోనూ హోలీ వేడుకలను కేంద్ర బలగాలు రద్దు చేసుకున్నాయి. అదే ఏడాది ఏప్రిల్‌లో సుక్మా జిల్లాలో సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందిపై మావోయిస్టులు జరిపిన దాడిలో 25 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మరణించారు. మరోవైపు పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లకు నివాళిగా హోలీ వేడుకలు జరుపుకోవడం లేదని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటించారు.

>
మరిన్ని వార్తలు