జంతర్‌మంతర్‌ వద్ద పారామిలటరీ బలగాల నిరసన

3 Mar, 2019 15:10 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశం కోసం ప్రాణాలొడ్డే సైనికులు డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కారు. పారామిలటరీ బలగాలను చిన్నచూపు చూస్తున్నారని ఆరోపిస్తూ ఆదివారం దేశ రాజధానిలోని జంతర్‌మంతర్‌ వద్ద జవాన్లు నిరసన చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ పారామిలటరీ బలగాలతో దివాళీ వేడుకలు జరుపుకున్నా తమ కోసం ఆయన ఏం చేశారని ఓ సైనికుడు ప్రశ్నించారు.

తాము 2004 నుంచి ఫించన్‌ పొందడం లేదని, తమకు ఒకే ర్యాంక్‌, ఒకే పెన్షన్‌ అమలు కావడం లేదని, కనీసం అమరవీరుల హోదాను నిరాకరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పారామిలటరీ బలగాల డిమాండ్లను ప్రధాని నరేంద్ర మోదీ నెరవేర్చకుంటే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆయనకు తాము గట్టి సందేశం పంపుతామని నిరసనకారులు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తమ పట్ల సవతితల్లి ప్రేమను కనబరుస్తోందన్నారు. నరేంద్ర మోదీ సర్కార్‌ తమ కోసం చేసిందేమీ లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు