పార్లమెంటును ‘3 డీ’లతో నడపాలి: రాష్ట్రపతి

14 Dec, 2015 01:04 IST|Sakshi
పార్లమెంటును ‘3 డీ’లతో నడపాలి: రాష్ట్రపతి

కోల్‌కతా: పార్లమెంటును చర్చలు(డిబేట్), భిన్నాభిప్రాయ ప్రకటన(డిసెంట్), నిర్ణయాలతో(డెసిషన్) నడిపించాలే కానీ అంతరాయాలు, అడ్డుకోవడం(డిస్రప్షన్) ద్వారా కాదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. కలకత్తా వర్సిటీలో ఆదివారం జవహర్‌లాల్ నెహ్రూ స్మారక ఉపన్యాసం ఇస్తూ.. నిరసనలు తెలిపేందుకు వేరే వేదికలున్నాయని అన్నారు.  పార్లమెంట్‌ను కాంగ్రెస్ అడ్డుకుంటున్న నేపథ్యంలోఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మరోచోట, మాట్లాడుతూ.. దేశంలోని ప్రతీ పౌరుడు వివక్షకు గురికాకుండా జీవించే పరిస్థితులుండాలన్నారు. కాగా, ప్రణబ్ పాల్గొన్న నెహ్రూ జయంతి వేడుకను నిర్వాహకులు పొరపాటున జాతీయ గీతమైన జనగణమనతో కాకుండా వందేమాతరంతో ప్రారంభించారు. తర్వాత క్షమాపణ చెప్పారు.

మరిన్ని వార్తలు