ఓట్లా.. ఓట్ల శాతమా?

22 Aug, 2017 01:16 IST|Sakshi

రాజకీయ పార్టీల అభిప్రాయం కోరిన పార్లమెంటరీ కమిటీ
న్యూఢిల్లీ:
ప్రస్తుతం దేశంలో అనుసరిస్తున్న ఎక్కువ ఓట్లను సాధించిన వ్యక్తిని విజేతగా ప్రకటించే ‘ఫస్ట్‌ పాస్ట్‌ ది పోస్ట్‌ (ఎఫ్‌పీటీపీ) ఎన్నికల విధానంపై అభిప్రాయాలు తెలపాల ని న్యాయ, మానవ వనరులపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీల్ని కోరింది. ఎఫ్‌పీటీపీ విధానం సరైంది కాదేమోననే సందేహాలు వ్యక్తం చేసింది. అందుకు ఈ ఏడాది జరిగిన ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల్ని ఉదాహ రణగా పేర్కొంది. యూపీలో 39 శాతం ఓట్లు వచ్చిన బీజేపీకి 312 సీట్లు రాగా, 22 శాతం వచ్చిన సమాజ్‌వాదీ పార్టీకి 47 సీట్లు, 21 శాతం వచ్చిన బీఎస్పీకి కేవలం 19 సీట్లే వచ్చాయి.

ఈ విధానంలో సాధించిన ఓట్ల శాతంతో సంబంధం లేకుండా ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు పొందిన అభ్యర్థి గెలిచినట్లు. ఓట్ల శాతానికి ప్రాతినిధ్య విధానం సహా మరికొన్ని ఎన్నికల వ్యవస్థల గురించి కమిటీ ప్రస్తావించింది. అలాగే రాజకీయ పార్టీలకు వ్యక్తిగత నగదు విరాళాల్ని రూ. 2 వేలకు పరిమితం చేయడం సహేతుకమా? కాదా? అన్న అంశంపై స్పందించాలని పార్టీల్ని కమిటీ కోరింది. ఎలక్టోరల్‌ బాండ్స్‌ ద్వారా విరాళాలిచ్చే వారి వ్యక్తిగత గోపత్యకు ఏమైనా ప్రమాదముం టుందా అని కూడా ప్రశ్నించింది.ఎన్నికల సంస్కరణలపై ఆర్థిక బిల్లులో సూచించిన సిఫార్సుల్ని పరిశీలించిన కమిటీ ఆ మేరకు పార్టీలకు ప్రశ్నావళిని పంపింది.

నగదు లావాదేవీల వాడకం తగ్గిం చడం, రాజకీయ పార్టీలకు విరాళాల విష యంలో పారదర్శకత కోసం ఆర్థిక బిల్లు, 2017లో ఆదాయపు పన్ను చట్టానికి సవరణ లు సూచించారు. పార్టీలకు ఇచ్చే వ్యక్తిగత నగదు విరాళాలు రూ.2వేలు మించకూడదని అందులో పేర్కొన్నారు. అయితే రూ.2వేల పరిమితి ప్రస్తుతం దేశ ద్రవ్యోల్బణ దృష్ట్యా మార్కెట్‌ పరిస్థితులకనుగుణంగా ఉందా అని ప్రశ్నావళిలో కమిటీ పేర్కొంది. ప్రస్తుత ఎన్నికల వ్యవస్థలు, మీడియా/పార్టీ ప్రచారా నికి ఉచిత ప్రచార సమయం, రాజకీయ పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం తదితర అంశాలపై పార్టీల అభిప్రాయాల్ని కోరింది.

అభియోగాలు దాఖలైతే అనర్హత వేటుపై ఆందోళన
కోర్టులో అభియోగాలు దాఖలు చేసే రోజు నుంచే ఎన్నికల్లో పోటీ చేయ కుండా అనర్హుల్ని చేయాలన్న ప్రతిపాద నపై కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ చట్టం అమల్లోకి వస్తే అధికారంలో ఉన్న పార్టీ దుర్వినియోగం చేసే అవకాశముం దని, ఈ అంశంపై పార్టీలు తమ అభిప్రా యాలు తెలపాలని కోరింది. ప్రస్తుతం కేసులో దోషిగా తేలితేనే అనర్హత వేటు వేస్తున్నారు.

మరిన్ని వార్తలు