నేటి నుంచే రైలు చార్జీల పెంపు అమలు

25 Jun, 2014 07:10 IST|Sakshi
నేటి నుంచే రైలు చార్జీల పెంపు అమలు

* ‘మెట్రో’ ప్రయాణికులకు మాత్రం ఊరట  
* 80 కి.మీల వరకు సెకండ్ క్లాస్ సబర్బన్‌పై భారం లేదు  
* రైల్వే శాఖ తాజా నిర్ణయం

 
 న్యూఢిల్లీ: రైలు ప్రయాణం నేటినుంచి భారం  కానుంది. ఇటీవల పెంచిన ప్రయాణ, రవాణా చార్జీలు ఈ రోజు(బుధవారం) నుంచే అమలు కానున్నాయి. అయితే, మెట్రో నగరాల రైలు ప్రయాణికులకు ఊరటనిచ్చేలా.. 80 కి.మీల వరకు రెండో తరగతి సబర్బన్ రైలు ప్రయాణాలపై తాజా చార్జీల పెంపు వర్తించదని రైల్వే శాఖ మంగళవారం ప్రకటించింది. దీంతో ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబై లాంటి మెట్రో నగరాల నుంచి చుట్టుపక్కల ప్రాంతాలకు 80 కిమీల మేర ప్రయాణించే లక్షలాది మందికి ప్రయోజనం చేకూరనుంది. రైళ్లలో ప్రయాణ చార్జీలను 14.2%, రవాణా చార్జీలను 6.5% పెంచుతూ కేంద్రం జూన్ 20న నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. కాగా,  మహారాష్ట్రకు చెందిన బీజేపీ, శివసేన ఎంపీలు మంగళవారం రైల్వే మంత్రి సదానంద గౌడను కలిసి చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని కోరిన కొన్ని గంటల తరువాత రైల్వే శాఖ పలు సవరణలతో తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులోని వివరాలు..
 
 8    అన్‌రిజర్వ్‌డ్ విభాగంలో జూన్ 25 నుంచి కాకుండా జూన్ 28 నుంచి చార్జీల పెంపు అమల్లోకి వస్తుంది.
 8    నెలవారీ పాసులు తీసుకునే ప్రయాణికులు.. గతంలో మాదిరి 30 ట్రిప్పులకు కాకుండా, 15 ట్రిప్పులకు మాత్రమే డబ్బులు చెల్లించి, ఒక నెలలో అపరిమితంగా ప్రయాణించవచ్చు.
 8    {పధాన రైళ్లలో ప్రయాణానికి చార్జీల పెంపు కన్నా ముందే టికెట్లు కొనుగోలు చేసినవారు అదనపు రుసుమును చెల్లించనక్కరలేదు.
 8    ముందుగా జారీ చేసిన రైల్వే టికెట్లకు కూడా చార్జీల పెంపు వర్తిస్తుంది.
 8    చార్జీల పెంపు నిర్ణయం కన్నా ముందు ప్రయాణ టికెట్లు రిజర్వ్ చేసుకున్నవారు అదనపు రుసుమును బుకింగ్ లేదా రిజర్వేషన్ కౌంటర్ల వద్ద కానీ, టీటీఈ వద్ద కానీ చెల్లించాల్సి ఉంటుంది. రిజర్వేషన్ ఫీజు, సూపర్ ఫాస్ట్ సర్‌చార్జ్ లాంటి వాటిలో ఎలాంటి మార్పు లేదు.

మరిన్ని వార్తలు