బ్రోకర్లకు షాక్: ఆ ఆఫీసుల్లోకి అనుమతించరు!

8 Jan, 2018 19:29 IST|Sakshi

రిజిస్ట్రార్‌ శాఖ ఉత్తర్వులు

సాక్షి, చెన్నై(టీ.నగర్)‌: సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలలో ఇకపై బ్రోకర్లను నిషేధిస్తూ తమిళనాడు రిజిస్ట్రార్‌ శాఖ సోమవారం ఉత్తర్వులిచ్చింది. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలలో బ్రోకర్ల కార్యకలాపాలు అధికంగా ఉంటూ వస్తున్నాయి. దీంతో అనేక అక్రమాలు జరుగుతున్నట్లు పలువురు ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. దీనికి సంబంధించి మద్రాసు హైకోర్టులో కూడా పిటిషన్‌ దాఖలయింది.

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పనితీరు గురించి కూడా న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలావుండగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో బ్రోకర్లను రాష్ట్ర ప్రభుత్వ రిజిస్ట్రార్‌ శాఖ నిషేధం విధించింది. ఈ ఏడాది మార్చి నెల నుంచి ఈ చర్యలు అమలులోకి రానుంది. మార్చి నెల నుంచి ఆస్తులు కొనుగోలు చేసేవారు, విక్రయించేవారిని మాత్రమే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోకి అనుమతిస్తారని, అక్కడ బ్రోకర్లు కనిపిస్తే పోలీసుల ద్వారా కఠిన చర్యలు తీసుకుంటారని తమిళనాడు రిజిస్ట్రార్‌ శాఖ వెల్లడించింది.

మరిన్ని వార్తలు