పడవ బోల్తా: అధికారులు సేఫ్‌, ఒకరు మృతి

24 Oct, 2018 18:38 IST|Sakshi

ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఓ పడవ ప్రమాదానికి గురయింది.  ముంబై నారీమన్ పాయింట్ నుంచి 2.6 కిలోమీటర్ల దూరంలో శివాజీ స్మారక్ వద్ద  సముద్రంలో  బుధవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ పడవలో మహారాష్ట్ర చీఫ్ సెక్రటరీ దినేష్‌ కుమార్‌ జైన్‌తోపాటు ఇతర సీనియర్‌  అధికారులు  కూడా ఉన్నారన్న సమాచారం  కలకలం రేపింది.   ఈ ప్రమాదంలో ఒకరు చనియారు.  మిగిలిన వారిని రక్షించామనీ కోస్ట్ గార్డ్ పీఆర్‌వో  వెల్లడించారు.

పడవలో మొత్తం 25 మంది ఉన్నారని పోలీసులు ధృవీకరించారు. అయితే చనిపోయిన వారి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. శివాజీ స్మారక నిర్మాణ పనులను పరిశీలించేందుకు రెండు స్పీడ్ బోట్లలో వెళ్తుండగా సీఎస్, ఎమ్మెల్సీ ఉన్న బోటు ప్రమాదానికి గురైంది. మరో బోటులో 40 మంది పాత్రికేయులు ఉన్నారు. శివాజీ స్మారకానికి 2.6 కిలో మీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. రాళ్లను పడవ ఢీకొట్టడంతో బోల్తా పడినట్లుగా తెలుస్తోంది. ప్రమాదం కారణంగా శివాజీ స్మారకం పనులను నిలిపివేశారు.

మరిన్ని వార్తలు