ఎయిరిండియా విమానంలో వ్యక్తి అనూహ్య మృతి!

14 Jun, 2020 16:05 IST|Sakshi

ముంబై: ఎయిరిండియా విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి (42) అనూహ్యంగా ప్రాణాలు విడిచాడు. తీవ్రమైన చలిజ్వరంతోనే అతను మృతిచెందినట్టు తెలిసింది. నైజిరియాలోని లాగోస్‌ నుంచి ముంబైకి బయలుదేరిన విమానంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక కరోనా నేపథ్యంలో అన్ని ఎయిర్‌పోర్టుల్లో థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రయాణానికి ముందే సదరు వ్యక్తికి కూడా థర్మల్‌ స్క్రీనింగ్‌ చేశారు. ఆ సమయంలో.. అతను శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నట్టు ఓ మీడియా సంస్థ తెలిపింది.

అయినప్పటికీ.. అతన్ని ప్రయాణానికి ఎలా అనుమంతించారో అంతుబట్టడం లేదని పేర్కొంది. అయితే, ఎయిరిండియా ఈ ఆరోపణలను కొట్టిపారేసింది.‘లాగోస్‌ నుంచి ముంబైకి ప్రయాణించిన వ్యక్తి.. విమానం ముంబై ల్యాండ్‌ అవ్వగానే అనూహ్యంగా కుప్పకూలిపోయాడు. ఆ సయమంలో విమానంలో ఉన్న వైద్య సిబ్బంది అతనికి చికిత్స అందించారు. కానీ అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. చనిపోయిన వ్యక్తిది సహజ మరణమని స్పష్టం చేసింది. (చదవండి: ఆ కుటుంబానికి రూ.7.64 కోట్లివ్వండి)

>
మరిన్ని వార్తలు