విమానంలోనే ప్రాణాలొదిలిన వ్యక్తి

5 Jun, 2019 17:15 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

విమాన ప్రయాణంలో అకస్మాత్తుగా అనారోగ్యం

మెడికల్‌ ఎమర్జెన్సీ కింద అత్యవసర ల్యాండింగ్‌

అప్పటికే ప్రాణాలొదిలిన వ్యక్తి

తిరువనంతపురం : ఎయిరిండియా విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు మార్గమధ్యలోనే ప్రాణాలొదిలాడు. తిరువనంతపురం-షార్జా ఎయిరిండియా విమానంలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడి వివరాలను  ఇంకా గుర్తించాల్సి ఉందనీ అధికారులు తెలిపారు.  ఈ విషాదం కారణంగా విమానం ఆలస్యంగా  షార్జాకు బయలు దేరింది. 

తిరువంతనపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాత్రి 8.24 నిమిషాలకు విమానం బయలుదేరింది. ఇంతలో ఒక ప్రయాణికుడు అనారోగ్యానికి గురికావడంతో వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించారు. కానీ అప్పటికే సదరు ప్రయాణీకుడు కన్నుమూశాడని వైద్యులు ధృవీకరించారు. ప్యాసింజర్‌ వివరాలను గుర్తించి, బంధువులకు సమాచారం ఇచ్చేందుకు ఎయిర్‌లైన్స్‌ అధికారులు ప్రయత్నిస్తున్నారు.  ఎయిరిండియా విమానం 967 తిరువనంతపురం ప్రయాణీకులలో ఒకరు జబ్బుపడి మరణించంతో అత్యవసర ల్యాండింగ్ చేయవలసి వచ్చిందని ఎయిర్ ఇండియా ప్రతినిధి  ధనుంజయ్‌ కుమార్  తెలిపారు.  అతనికి సంబంధించిన వస్తువులను సిబ్బందికి అందజేసామన్నారు. అయితే ప్రయాణికుడి ఆకస్మిక మృతికి గల కారణాలు తెలియరాలేదన్నారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా