మొద‌టి రైలు: నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న

13 May, 2020 15:49 IST|Sakshi

న్యూఢిల్లీ : లాక్‌డౌన్ కార‌ణంగా దేశంలో నిలిచి పోయిన రైల్వే సేవ‌ల‌ను  మే 12 నుంచి తిరిగి ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఐఆర్‌సీటీసీ ద్వారా టికెట్ల విక్రయాలు జరుగుతాయని.. 15 సర్వీసులను ప్రత్యేక రైళ్లుగా నడపాలని నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఈ నేప‌థ్యంలో అహ్మాదాబాద్ నుంచి బుధ‌వారం న్యూఢిల్లీ చేరుకున్న మొద‌టి రైలులో భౌతిక దూరం నిబంధ‌న‌లను ఉల్లంఘించారు. ఈ రైలు మే 12 న సాయంత్రం 6.30 గంటలకు సబర్మతి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి బుధవారం ఉదయం 8 గంటలకు ఢిల్లీ చేరుకుంది. (అపుడు లాక్‌డౌన్‌ పరిస్థితి వచ్చి వుంటే.. )

కాగా రైలులో ప్రయాణించే వారి కోసం కోచ్‌లోనే చిన్న గ‌దిని ఏర్పాటు  చేసి ఆహార ఉత్ప‌త్తులైన బిస్కెట్లు, భుజియా, చాక్లెట్లు అందుబాటులో ఉంచారు. అయితే ప్రయాణికులు కూర్చున్న కోచ్‌, చిన్నవంట‌గ‌దికి దూరంగా ఉండ‌టంతో ప్రయాణీకులు ఆహార ప‌దార్థాల‌ను కొనడంలో సమస్యలను ఎదుర్కొన్నారు. ఆక‌లి తీర్చుకునేందుకు వంట‌గ‌ది వ‌ద్ద‌ ప్ర‌యాణికులు ఎగ‌బ‌డ్డారు. దీని ఫలితంగా రైలునంబర్ 02957 బి -1 కోచ్ సమీపంలో ఉన్న చిన్నగది వ్యాన్ వద్ద తీవ్ర రద్దీ ఏర్పడింది. (రైలు దిగగానే.. స్టాంప్‌ వేసేశారు! )

రాత్రి స‌మ‌యంలో చిన్న వంట గది వద్ద ప్ర‌యాణికులు గుమిగూమిన‌ప్పుడు ప్ర‌జ‌లంతా ఒక్క‌క్క‌రుగా వంట‌గది వ‌ద్ద‌కు రావాల‌ని అధికారులు కోరిన‌ట్లు రైలులో ప్ర‌యాణించిన‌ నిహార్ కక్కాడ్  అనే విద్యార్థి తెలిపారు. వాటర్ బాటిల్స్ కొనడానికి చాలా మంది క్యూ కట్టడంతో రద్దీని నివారించడానికి కోచ్‌లోనే నీటిని అమ్మడం ప్రారంభించార‌ని పేర్కొన్నాడు. చాలా మంది ప్రయాణీకులు ఆహారాన్ని తీసుకెళ్లలేదని, చిన్నగదిలో లభ్యమైన వాటిని కొనవలసి వచ్చింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. (లాక్‌డౌన్‌ : మూడు గంటల్లో రూ.10 కోట్లు)

>
మరిన్ని వార్తలు