పౌరసత్వం: పాస్‌పోర్టు తప్పనిసరి కాదు

1 Mar, 2020 09:12 IST|Sakshi

కలకత్తా హైకోర్టు

కోల్‌కత: సరైన పాస్‌పోర్టు లేకున్నా భారత పౌరసత్వం కోసం విదేశీయులు దరఖాస్తు చేసుకోవచ్చని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. అయితే, పాస్‌పోర్టు ఎందుకు లేదో సరైన కారణాలు తెలియజేయాల్సి ఉంటుందని పేర్కొంది. పౌరసత్వ నిబంధనలు-2019లోని 11వ నిబంధన ప్రకారం పాస్‌పోర్టు కలిగి ఉండకపోవడానికి గల కారణాలు పేర్కొంటూ సంబంధిత అధికారికి దరఖాస్తు చేసుకోవచ్చని పిటిషనర్‌కు జస్టిస్‌ సబ్యసాచి భట్టాచార్య అనుమతిచ్చారు. పౌరసత్వానికి సంబంధించిన దరఖాస్తు పత్రంలో (ఫారం 3)లోని క్లాజ్‌ 9లో పాస్‌పోర్టు వివరాలు పొందుపరచడమే కాకుండా సరైన పాస్‌పోర్టు నకలును దరఖాస్తుకు జతచేయాల్సి ఉంటుంది. అయితే, 1955 పౌరసత్వ చట్టంలోని సెక్షన్‌ 5(1) (సీ) ప్రకారం పాస్‌పోర్టును తీసుకెళ్లడం తప్పనిసరి కాదని చెబుతోందని కోర్టు గుర్తు చేసింది. పైగా పిటిషనర్‌ తన వద్ద పాస్‌పోర్టు లేకపోవడానికి సరైన కారణాలు తెలిపారని, సదరు అధికారులు కూడా అందుకు సంతృప్తి చెందారని పేర్కొంది.
(చదవండి : సామరస్యం మిగిలే ఉంది!)

మరిన్ని వార్తలు