డెత్‌వారెంట్లపై స్టే ఇచ్చిన పటియాల కోర్టు

2 Mar, 2020 17:52 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ దోషుల ఉరిశిక్ష మరోసారి వాయిదా పడింది. డెత్‌వారెంట్లపై స్టే ఇవ్వాలంటూ దోషుల్లో ఒకరైన పవన్‌ గుప్తా దాఖలు చేసిన పిటిషన్‌పై పటియాల హౌస్‌కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు దోషులను ఉరి తీయవద్దంటూ తీహార్‌ జైలు అధికారులకు కోర్టు ఆదేశాలు జారీచేసింది. పిటిషన్‌పై విచారణ ముగిసే వరకు ఉరి నిలుపుదల చేయాలని పేర్కొంది. మార్చి 3న (మంగళవారం) నలుగురు దోషులను ఉరితీయాలంటూ ఇదివరకే కోర్టు డెత్‌వారెంట్లు జారీచేసిన విషయం తెలిసిందే. కాగా శిక్ష అమలుపై స్టే ఇవ్వడం ఇది మూడోసారి కావడం గమనార్హం. (క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన రాష్ట్రపతి)

గతంలో జనవరి 22, ఫిబ్రవరి 1, మార్చి3 ఉరి తీయాలంటూ ఇచ్చిన డెత్ వారెంట్లపై పటియాల కోర్టు స్టే ఇచ్చింది. మరోవైపు దోషుల్లో ఒకరైన పవన్‌ గుప్తా రాష్ట్రపతికి దాఖలు చేసిన క్షమాభిక్ష పటిషన్‌ను రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో మార్చి 3న దోషులను ఉరి తీయడం దాదాపు ఖరారే అనుకున్నారంతా. ఈ క్రమంలోనే ఉరిశిక్ష మరోసారి వాయిదా పడటం తీవ్ర విస్మయానికి గురిచేస్తోంది.

మరిన్ని వార్తలు