ముగిసిన హార్ధిక్‌ పటేల్‌ ఆమరణ దీక్ష

12 Sep, 2018 16:04 IST|Sakshi
పటీదార్‌ ఉద్యమ నేత హార్థిక్‌ పటేల్‌ (ఫైల్‌ఫోటో)

అహ్మదాబాద్‌ : పటేళ్లకు రిజర్వేషన్లు, రైతుల రుణమాఫీ తదితర డిమాండ్లతో 19 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న పటేల్‌ ఉద్యమ నేత హార్థిక్‌ పటేల్‌ బుధవారం తన ఆందోళన విరమించారు. భవిష్యత్‌ పోరాటాల కోసం బతికిఉండాలని అనుచరులు నచ్చచెప్పడంతో ఆయన దీక్ష విరమించారు. పటిదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి (పీఏఏఎస్‌) నేత హార్థిక్‌ పటేల్‌ ఆగస్ట్‌ 25 నుంచి తన నివాసంలో ఆమరణ నిరాహార దీక్షకు ఉపక్రమించారు.

పటేళ్లకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడం, రైతులకు రుణమాఫీ డిమాండ్లను నెరవేర్చేవరకూ తన ఆందోళన కొనసాగుతుందని హార్థిక్‌ అంతకుముందు ప్రకటించారు. కాగా పటేల్‌ దీక్షకు కాంగ్రెస్‌ సహా విపక్షాల నుంచి మద్దతు లభించింది. ప్రభుత్వం తక్షణమే కోటా సమస్యను పరిష్కరించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

యూపీలో 74 స్ధానాలు మావే..

సీబీఐ చీఫ్‌ ఎంపికకు 24న కమిటీ భేటీ

అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ప్రొఫెసర్‌పై చర్యలు

అదృష్టం కలిసి వస్తుందని...

న్యాయవ్యవస్థ కళ్లు తెరవాల్సిందే!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్లే బాయ్‌గా ‘అర్జున్‌ రెడ్డి’..!

లండన్‌ దాకా డోల్‌బాజే అంటున్న తమన్నా

‘తను ఎప్పటికీ అలాంటి పని చేయడు’

‘అర్జున్‌ రెడ్డి’ నటితో విశాల్‌ పెళ్లి!

విక్రమ్‌ న్యూ లుక్‌.. వైరల్‌ అవుతున్న టీజర్‌

ప్రియా ప్రకాశ్‌కు షాకిచ్చిన బోనీ కపూర్‌