బెడ్‌షీట్‌పై పేషెంట్‌ను లాక్కెళ్లారు..

30 Jun, 2019 15:06 IST|Sakshi

జబల్‌పూర్‌ : మధ్యప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ మెడికల్‌ కాలేజ్‌లో హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రిలో పేదవారికి ఏ రకమైన వైద్యం అందుతుందో ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. జబల్‌పూర్‌లోని నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ మెడికల్‌ కాలేజ్‌లో ఓ పేషెంట్‌కు ఎక్స్‌ రే తీయించాలని వైద్యులు తెలిపారు. అయితే సిబ్బంది పేషెంట్‌ను ఎక్స్‌ రే రూమ్‌కు బెడ్‌షీట్‌పై లాక్కుని వెళ్లారు. ఆస్పత్రిలో స్ట్రెచ్చర్లు లేకపోవడంతో ఈ సంఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. వైద్య అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగినట్టు అక్కడ ఉన్నవారు ఆరోపిస్తున్నారు. 

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు బయటకు రావడంతో సిబ్బంది, అధికారుల తీరుపై పెద్ద ఎత్తున్న విమర్శలు వస్తున్నాయి. దీంతో మెడికల్‌ కాలేజ్‌​ డీన్‌ నవనీత్‌ సక్సేనా ఈ ఘటనతో సంబంధం ఉన్న ముగ్గురు సిబ్బందిని సస్పెండ్‌ చేసినట్టు వెల్లడించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు