మెహబూబాతో పార్టీ నేతల మీటింగ్‌కు గవర్నర్‌ ఓకే

6 Oct, 2019 21:03 IST|Sakshi

శ్రీనగర్‌: గృహనిర్బంధంలో ఉన్న జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీని ఆ పార్టీ నేతలు సోమవారం కలవనున్నారు. 10 మంది నాయకులతో కూడిన పీడీపీ బృందం ముఫ్తీతో భేటీ అయ్యేందుకు గవర్నర్ సత్యపాల్ మాలిక్ అనుమతి ఇచ్చారు. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో ఆగస్ట్ 4 నుంచి మెహబూబా ముఫ్తీ గృహనిర్బంధంలో ఉన్నారు.
 
అబ్దుల్లాను కలిసిన ఎన్సీ నేతలు
రెండు నెలలుగా గృహ నిర్బంధంలో ఉన్న నేషనల్​ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా పార్టీ నేతలను కలుసుకున్నారు. ఎన్​సీ​ జమ్మూ అధ్యక్షుడు దేవేందర్​ సింగ్​ రానా నేతృత్వంలో 15మంది సీనియర్‌ నాయకులు ఫరూక్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ ఆయ్యారు. జమ్మూకశ్మీర్‌లో తాజా పరిస్థితులపై చర్చించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు