ప్రజలు ఆమోద ముద్ర వేశారు: లాలూ

26 Aug, 2014 14:45 IST|Sakshi
ప్రజలు ఆమోద ముద్ర వేశారు: లాలూ
పాట్నా: తాజా బీహార్ లో జరిగిన ఉప ఎన్నికల్లో తమ కూటమి విజయం దక్కడంపై ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆనందం వ్యక్తం చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. ఆర్జెడీ, జేడీ(యూ), కాంగ్రెస్ కూటమికి ప్రజలు ఆమోద ముద్ర వేశారు అని వ్యాఖ్యలు చేశారు. 
 
ప్రజలకు సామాజిక, ఆర్ధిక న్యాయానికి ఆందించడానికి కొత్త శకం మొదలైందని ఆయన అన్నారు. బీహార్ లో జరిగిన 10 అసెంబ్లీ స్థానాల్లో ఈ కూటమి 6 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ విజయంతో కార్యకర్తలు పొంగిపోకూడదని, పేద ప్రజలకు న్యాయం చేసేందుకు కృషి చేయాలని లాలూ పిలుపునిచ్చారు. 
మరిన్ని వార్తలు