మనుషులు ఇళ్లకు, జంతువులు బయటకు

6 Apr, 2020 18:07 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మనుషులు తమ తోటి మనుషులను ప్రేమించినా, ప్రేమించక పోయినా అప్పుడప్పుడు అడవుల్లోకి వేళ్లో, జంతు ప్రదర్శనశాలలకు వెళ్లో జంతువులను చూసి ఆనంద పడి పోతుంటారు. జంతువుల ఏకాంతాన్ని లేదా ప్రశాంతతను భంగం కలిగించినప్పుడు వాటికి మనుషుల మీద కోపం వస్తుంది. ఆహారం దొరక్కపోతే తప్పా జంతువులు మనుషులు విహరించే ప్రాంతాల్లోకి రావు. కోరలు సాచిన కరోనా కారణంగా మనుషులు ప్రస్తుతం ఇంటికే పరిమితం అవడంతో జనం సంచరించే ప్రాంతాల్లోకి వన్య ప్రాణులు, ఇతర జంతువులు వచ్చి అల్లరి పిల్లల్లాగా ఆనందిస్తున్నాయి. (మూడోదశకు కరోనా: ఎయిమ్స్‌)

లండన్‌లోని లాంకషైర్‌లోని ఓ ప్రాథమిక పాఠశాలలోకి ఇటీవల ఓ గొర్రెల మంద జొరపడి స్కూలు పిల్లలు గుడ్రంగా తిరిగే చట్రంపైకి ఎక్కి కాళ్లతో చక్రం తిప్పుతూ తెగ ఆనందించాయి. ఆ సుందర దశ్యాన్ని yð బ్బీ అలీస్‌ అనే యువకుడు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా అది వైరల్‌ అవుతోంది. మరెక్కడో సముద్రం ఒడ్డున నర పురుగులేని చోట ఓ జింక, అలల కెరటాలతో పోటీ పడి గెంతులు వేసింది. లేచి పడుతున్న అలల తీవ్రతకు, సంగీతం లాంటి వాటి ఘోషకు అనుగుణంగా చిందులు వేస్తున్న జింకను చూస్తుంటే మనుషులు కూడా మైమరచి పోతాం. ఎవరో వీడియో గ్రాఫర్‌ తీసి పోస్ట్‌ చేసిన ఈ వీడియో కూడా ఆన్‌లైన్‌లో వైరల్‌ అవుతోంది.

మరిన్ని వార్తలు